Prabhudeva: 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి అయిన ప్రభుదేవా!

Prabhudeva became father again at the age of 50

  • డాక్టర్ హిమానీని రెండో వివాహం చేసుకున్న ప్రభుదేవా
  • ఆడబిడ్డకు జన్మనిచ్చిన హిమానీ
  • 2011లో నయనతార కారణంగా తొలి భార్యకు విడాకులు

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మరోసారి తండ్రి అయ్యాడనే వార్త తమిళ సినీ పరిశ్రమలో వైరల్ అవుతోంది. 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందాడని చెప్పుకుంటున్నారు. ఆయన రెండో భార్య హిమానీ ఆడపిల్లకు జన్మనిచ్చిందని కోలీవుడ్ టాక్. 

ప్రభుదేవా వ్యక్తిగత జీవితానికి వస్తే... ఆయన 1995లో రామలతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రభుదేవా కోసం ఆమె హిందూ మతంలోకి కూడా మారారు. ఆమెతో వైవాహిక జీవితాన్ని గడుపుతూనే సినీ హీరోయిన్ నయనతారతో ప్రేమాయణం సాగించాడు. ఈ లవ్ స్టోరీ అప్పట్లో సంచలనం రేపింది. నయన్ వల్ల తొలి భార్యతో ప్రభుదేవాకు గొడవలు వచ్చాయి. అనంతరం ఇద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు. ఒకానొక సమయంలో రామలత మాట్లాడుతూ, అన్యోన్యంగా సాగుతున్న తమ సంసారంలో నయన్ నిప్పులు పోసిందని... ఆమె కనిపిస్తే చెంప పగలగొడతానని వ్యాఖ్యానించింది. 

అయితే ప్రభుదేవా, నయనతారల ప్రేమ వ్యవహారం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ చెప్పుకున్నారు. 2020లో డాక్టర్ హిమానీ సింగ్ ను ప్రభుదేవా రహస్య వివాహం చేసుకున్నాడు. తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నప్పుడు ఆమె ఫిజియో థెరపీ చేశారు. అయితే, పెళ్లి అయి మూడేళ్లవుతున్నా వీరిద్దరూ బహిరంగంగా పెద్దగా కనిపించింది లేదు. ఇప్పుడు ఈ జంటకు ఒక పాప పుట్టింది. అయితే, దీనిపై ప్రభుదేవా ఇంకా స్పందించాల్సి ఉంది.

Prabhudeva
Father
Daughter
Second Wife
  • Loading...

More Telugu News