Pavan Kalyan: పవన్ 'OG'లో ఛాన్స్ కొట్టేసిన శ్రియా రెడ్డి!

OG Movie Update

  • 'OG' ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లిన సుజీత్ 
  • పవన్ సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ 
  • 1950 కాలంలో .. ముంబై నేపథ్యంలో నడిచే కథ
  • ఈ డిసెంబర్ 22న రిలీజ్ చేయాలనే ఆలోచన 

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో 'OG' సినిమా రూపొందుతోంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చాలా ఫాస్టుగా ఈ సినిమా షూటింగు పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ అలరించనుంది.

ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం శ్రియా రెడ్డిని తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగులోకి ఆమెకి వెల్ కమ్ చెబుతూ, ఆమెకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రియా రెడ్డి ఎవరో కాదు .. హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య. గతంలో కొన్ని తమిళ సినిమాల్లో .. ఒకటి రెండు తమిళ సినిమాల్లో ఆమె నటించింది. 

'సలార్' సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్న శ్రియా రెడ్డి, 'OG'లోను ఛాన్స్ కొట్టేసిందన్న మాట. ఈ కథ 1950 కాలంలో .. ముంబై నేపథ్యంలో కొనసాగుతుందని అంటున్నారు. ఆ కాలానికి చెందిన గ్యాంగ్ స్టర్ గా పవన్ కనిపిస్తారని చెబుతున్నారు. ఈ డిసెంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.  సినిమాతోనైనా తెలుగులో ప్రియాంక అరుళ్ మోహన్ కి హిట్ పడుతుందేమో చూడాలి.

Pavan Kalyan
Priyanka Arul Mohan
Sujeeth
OG Movie
  • Loading...

More Telugu News