Jharkhand: రూ.10 అడిగాడని కుమారుడిని అంతమొందించిన తండ్రి

Man kills son for asking 10 rs in jharkhand
  • ఝార్ఖండ్‌, ఛత్రాజిల్లా వశిష్టనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • సోమవారం ఉదయమే భార్యతో పాటూ మద్యం తాగిన నిందితుడు
  • మద్యం మత్తులో ఉన్న భార్యాభర్తల మధ్య గొడవ
  • అదే సమయంలో తండ్రిని రూ.10 అడిగిన బాలుడు
  • విచక్షణ మరిచి కుమారుడిని గొంతు నులిమి చంపేసిన తండ్రి
మద్యం మత్తులో ఓ వ్యక్తి తన కుమారుడినే బలితీసుకున్నాడు. రూ.10 అడిగినందుకు గొంతు నులిమి చంపేశాడు. ఝార్ఖండ్‌లోని ఛత్రాజిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే, బీలేశ్ భూయాన్(48) తన భార్య, 15 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు పప్పు యాదవ్‌తో కలిసి వశిష్టనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నాడు. సోమవారం ఉదయం భార్యాభర్తలు పూటుగా తాగి గొడవపడ్డారు. ఈ క్రమంలో బాలుడు పది రూపాయలు ఇవ్వాలంటూ తండ్రిని అడిగాడు. 

అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న భూయాన్ విచక్షణ మరిచి కుమారుడిని గొంతు నులిమి ఉపిరాడకుండా చేసి పొట్టనపెట్టుకున్నాడు. అదే సమయంలో వారి కుమార్తె ఇసుకబట్టిలో తన పని ముగించుకుని ఇంటికి వచ్చింది. ఇంటికొచ్చాక తండ్రి చేసిన ఘోరం గురించి తెలిసి భయంతో పెద్దపెట్టున కేకలు వేసింది. దీంతో, అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Jharkhand

More Telugu News