BVSN Prasad: జనసేన పార్టీలో చేరిన టాలీవుడ్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్

Tollywood producer BVSN Prasad joins Janansena

  • రాజకీయాల్లోకి సడన్ ఎంట్రీ ఇచ్చిన బీవీఎస్ఎన్ ప్రసాద్
  • జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్
  • బీవీఎస్ఎన్ ప్రసాద్ కు పార్టీలోకి సాదరస్వాగతం పలికిన జనసేనాని

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. 

పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ అత్తారింటికి దారేది చిత్రానికి బీవీఎస్ఎన్ ప్రసాదే నిర్మాత. గతంలో ఎన్నడూ రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించని బీవీఎస్ఎన్ ప్రసాద్ ఉన్నట్టుండి జనసేన తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

BVSN Prasad
Janasena
Pawan Kalyan
Producer
Tollywood
Andhra Pradesh
  • Loading...

More Telugu News