Ntr: మరోసారి సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్?

Ntr in Sukumar Movie

  • షూటింగు దశలో ఎన్టీఆర్ 30వ సినిమా 
  • 31వ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 
  • 'వార్ 2' ఎన్టీఆర్ 32వ సినిమా అయ్యే ఛాన్స్ 
  • ఆలస్యమైతే సుకుమార్ ను రంగంలోకి దింపే ఆలోచనలో ఎన్టీఆర్  

ఈ సారి ఎన్టీఆర్ కీ .. అభిమానులకు మధ్య చాలానే గ్యాప్ వచ్చింది. 'ఆర్ ఆర్ ఆర్'కి ఎక్కువ సమయం కేటాయించడం వలన .. అనుకున్న సమయానికి కొరటాల ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లకపోవడం వలన ఇలా జరిగింది. దాంతో ఇకపై తన నుంచి వరుస సినిమాలు థియేటర్స్ కి వెళ్లేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 

ఆయన తాజా చిత్రంగా కొరటాలతో చేస్తున్న సినిమా సెట్స్ పై ఉంది. కెరియర్ పరంగా ఇది ఆయనకి 30వ సినిమా. 31వ సినిమాను ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందనుంది. ఇక 32వ సినిమాగా బాలీవుడ్ మూవీ 'వార్ 2' ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

ఒకవేళ 'వార్ 2' సెట్స్ పైటకి వెళ్లడం ఆలస్యమైతే, సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలోనే ఎన్టీఆర్ కి సుకుమార్ ఒక కథను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. 'నాన్నకు ప్రేమతో' తరువాత వాళ్లు చేయనున్న సినిమా ఇదే. ఈ లోగా విజయ్ దేవరకొండతో అనుకున్న ప్రాజెక్టును సుకుమార్ పూర్తిచేస్తాడని తెలుస్తోంది. 

Ntr
Sukumar
Tollywood
  • Loading...

More Telugu News