Rana Daggubati: రానాను మెప్పించే డైరెక్టర్ ఎవరో!

Rana Special

  • 'విరాటపర్వం' తరువాత గ్యాప్ తీసుకున్న రానా
  • ఇకపై వరుసగా సినిమాలు చేసే ఆలోచన 
  • వరుసగా కథలను వింటున్న రానా 
  • కొత్త దర్శకులకు సైతం అవకాశాలిచ్చే ఆలోచన

రానా ఆ మధ్య వరుస సినిమాలు చేస్తూ వెళ్లాడు. 'అరణ్య' .. 'విరాటపర్వం' వంటి సినిమాలు ఆయన అభిమానులను నిరాశపరిచాయి. ఆ తరువాత రానా నుంచి గ్యాప్ వచ్చేసింది. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలు .. మరో వైపున యంగ్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఇతర భాషల్లోను తమ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే తేజ దర్శకత్వంలో రానా హీరోగా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ వచ్చింది. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తరువాత రూపొందనున్న ఈ ప్రాజెక్టు పట్ల అందరూ ఆసక్తిని కనబరిచారు. అయితే రీసెంట్ గా రానా తమ్ముడు అభిరామ్ తో తేజ చేసిన సినిమా పరాజయం పాలైంది. దాంతో రానా మనసు మార్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. 

ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టే ఆలోచనలో రానా ఉన్నాడని అంటున్నారు. తెలుగు .. తమిళ దర్శకులు తెచ్చిన కథలను వింటున్నాడట. కథ నచ్చితే కొత్త దర్శకుడైనా చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. మరి కథల విషయంలో రానాను ఒప్పించే డైరెక్టర్లు ఎవరో .. ఎప్పుడు ఆయనను సెట్స్ పైకి తీసుకుని వెళతారో చూడాలి. 

Rana Daggubati
Actor
Teja
Tollywood
  • Loading...

More Telugu News