Toofan Vehicle: తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ ప్రమాదం... బోల్తాపడిన తూఫాన్ వాహనం

Toofan vehicle overturned in Tirumala ghat road
  • ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లపై తరచుగా ప్రమాదాలు
  • నేడు మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం
  • పలువురికి తీవ్ర గాయాలు
  • తిరుపతి రుయా ఆసుపత్రికి తరలింపు
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. తాజాగా తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. నాలుగో మలుపు వద్ద అదుపు తప్పిన ఓ తూఫాన్ వాహనం బోల్తాపడింది. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. పలువురికి తీవ్రగాయాలు కావడంతో వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లలో తరచుగా ప్రమాదాలు సంభవిస్తుండడం తెలిసిందే. గత మూడు వారాల వ్యవధిలో ఐదు ప్రమాదాలు నమోదయ్యాయి. ఇటీవల ఒకే రోజు రెండు ప్రమాదాలు జరిగాయి. ఘాట్ రోడ్లలో ప్రమాదాల నివారణకు టీటీడీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఘటనలు జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.
Toofan Vehicle
Road Accident
Ghat Road
Tirumala

More Telugu News