Tempo: తిరుమల ఘాట్ రోడ్డును వదలని ప్రమాదాలు... కొండను ఢీకొట్టిన టెంపో

Tempo hits hill rock on Tirumala ghat road

  • కొన్ని రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు
  • బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో కొండను ఢీకొట్టిన టెంపో
  • ధ్వంసమైన టెంపో ముందు భాగం

ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్లపై వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మూడు వారాల వ్యవధిలో నాలుగో ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ రెండో ఘాట్ రోడ్డులో తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఓ టెంపో వాహనం కొండను ఢీకొట్టింది. ఓ బస్సును ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. సేఫ్టీ వాల్, రెయిలింగ్ లేకపోవడంతో టెంపో నేరుగా కొండను తాకింది. ప్రమాద సమయంలో టెంపోలో డ్రైవర్ తప్ప ఎవరూ లేరు. కొండను ఢీకొట్టిన నేపథ్యంలో టెంపో ముందుభాగం ధ్వంసమైంది. వరుస ప్రమాదాలపై టీటీడీ పాలకవర్గం సమీక్ష చేపట్టి, సూచనలు చేసిన వారంలోపే ఘటన జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

Tempo
Road Accident
Ghat Road
Tirumala
  • Loading...

More Telugu News