Bihar: మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. మర్మాంగం కోసేసిన ప్రియురాలు

Woman cuts off boyfriends genitals in hotel room
  • బీహార్ రాజధాని పాట్నాలో ఘటన
  • బాధితుడు సీఆర్‌పీఎఫ్ జవాను
  • ప్రియురాలి అరెస్ట్
రహస్యంగా తనను వివాహం చేసుకున్న ప్రియుడు మరో యువతితో పెళ్లికి సిద్ధం కావడాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడిపై పగ తీర్చుకోవాలని భావించిన ఆమె పక్కాగా ప్లాన్ చేసి ప్రియుడి మర్మాంగాన్ని కోసేసింది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిందీ ఘటన. 

చత్తీస్‌గఢ్‌ సీఆర్‌పీఎఫ్ జవానుగా పనిచేస్తున్న బాధితుడు బంధువుల అమ్మాయిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవల ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ నెల 23న ప్రియుడు మరో అమ్మాయిని పెళ్లాడబోతున్నట్టు ప్రియురాలికి తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

పాట్నాలోని ఓ హోటల్‌లో కలుసుకుందామని ప్రియుడికి కబురు పంపింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ హఠాత్‌ పరిణామంతో ప్రియుడు ఒక్కసారిగా షాకయ్యాడు. ఆపై బాధతో విలవిల్లాడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని అరెస్ట్ చేశాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి మర్మాంగం 60 శాతం తెగిందని, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
Bihar
Chhattisgarh
Lover
Genitals

More Telugu News