Tejashwi Yadav: కేసీఆర్ తో మాట్లాడలేదు.. మిగతా పార్టీల నాయకులంతా వస్తున్నారు: తేజస్వి యాదవ్

KCR not attending Opposition parties meeting

  • ఈ నెల 23న పాట్నాలో విపక్ష నేతల సమావేశం
  • 15 పార్టీల నేతలు వస్తున్నారన్న తేజస్వి 
  • కేసీఆర్ గురించి లేని స్పష్టత

వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీని ఓడించేందుకు విపక్షాలు ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 23న పాట్నాలో విపక్ష నేతలు సమావేశమవుతున్నారు. బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ, 15 పార్టీలకు చెందిన ప్రధాన నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారని తెలిపారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. కేసీఆర్ తో మాట్లాడలేదని అన్నారు. 2024 ఎన్నికల విషయంలో బీజేపీ భయపడుతోందని చెప్పారు. 

గత కొన్ని నెలలుగా నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ లు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి విక్షాలను ఏకం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. మరోవైపు జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ... మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, హేమంత్ సొరేన్, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, స్టాలిన్, కేజ్రీవాల్, డి.రాజా, సీతారామ్ ఏచూరి, దీపాంకర్ భట్టాచార్యలు సమావేశానికి హాజరవుతున్నారని వెల్లడించారు.

  • Loading...

More Telugu News