Jagan: సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. పలు అంశాలను ఆమోదించనున్న మంత్రివర్గం
- సెక్రటేరియట్ మొదటి బ్లాక్ లో కొనసాగుతున్న సమావేశం
- అమ్మఒడి, విద్యాకానుక పంపిణీకి ఆమోదం తెలపనున్న కేబినెట్
- కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపే అవకాశం
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షత కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ లో ఉన్న కేబినెట్ మీటింగ్ హాల్లో సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. ఈ ఏడాది అమ్మఒడి పథకం అమలును ఆమోదించనున్నారు. గ్రూప్ 1, 2 పోస్టులు, ఈ ఏడాది విద్యా కానుక పంపిణీకి ఆమోదం తెలపనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ బదులు జీపీఎస్ అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ లో ఎంవోయూలు చేసుకున్న కంపెనీలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.