Actor Siddharth: శర్వానంద్ పెళ్లిలో పాట పాడి అతిథులను అలరించిన హీరో సిద్ధార్థ్.. వీడియో ఇదిగో!

Actor Siddharth Singing at Sharwanand and Rakshitha Reddy Wedding Event

  • లైవ్ కాన్సెర్ట్ లో ఓయ్ సినిమా పాట పాడిన సిద్ధార్థ్
  • జైపూర్ లో జరిగిన పెళ్లి వేడుకలకు హాజరైన టాలీవుడ్ హీరోలు
  • మహాసముద్రం సినిమాలో కలిసి నటించిన సిద్ధార్థ్, శర్వానంద్

టాలీవుడ్ హీరో శర్వానంద్ పెళ్లి ఈ నెల 3న జైపూర్ లో జరిగిన విషయం తెలిసిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ హీరోలతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. హీరో రాంచరణ్, సిద్ధార్థ్, హీరోయిన్ అదితీరావు తదితరులు ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా లైవ్ కాన్సెర్ట్ జరుగుతుండగా హీరో సిద్ధార్థ్ అతిథులను సర్ ప్రైజ్ చేశారు. సింగర్స్ ఓయ్ సినిమాలో ఓయ్ ఓయ్ అంటూ పాడుతుండగా స్టేజీ మీదికి వెళ్లిన సిద్ధార్థ్ తనూ గొంతు కలిపాడు. సిద్ధార్థ్ ను ఎంకరేజ్ చేసేందుకు సింగర్స్ పాడడం ఆపేయగా.. సిద్ధార్థ్ ఓయ్ ఓయ్ అంటూ పాట పాడారు.

స్టేజిపై సిద్ధార్థ్ పాడుతుండగా తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలోనూ ఈ పాట పాడింది హీరో సిద్ధార్థే కావడం విశేషం. కాగా, మహాసముద్రం మూవీలో శర్వానంద్, సిద్ధార్థ్ కలిసి నటించారు. ఇందులో అదితీరావు హైదరీ కథానాయికగా నటించగా.. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత హీరోలు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు.

More Telugu News