Kamal Haasan: 'ఇండియన్ 2' సినిమాలో విలన్ ఆయనే!

Indian 2 movie update

  • షూటింగు దశలో ఉన్న 'ఇండియన్ 2'
  • విలన్ గా తెరపైకి ఎస్.జె. సూర్య పేరు
  • ఇటీవల కాలంలో పవర్ఫుల్ విలన్ గా ఎదిగిన నటుడు 
  • ముఖ్య పాత్రలలో కనిపించనున్న కాజల్ .. రకుల్

కమలహాసన్ కథానాయకుడిగా గతంలో వచ్చిన 'ఇండియన్' ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కమల్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఇండియన్ 2' సినిమాను శంకర్ రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో విలన్ గా కమల్ తో తలపడేవారు ఎవరు? అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే విలన్ గా ఎస్. జె. సూర్య పేరు తెరపైకి వచ్చింది. గతంలోనే ఎస్. జె. సూర్య పేరు వినిపించింది. కానీ ఆయనను చరణ్ సినిమా కోసం శంకర్ తీసుకున్నాడని చెప్పుకున్నారు. అయితే 'ఇండియన్ 2'లో కూడా ఆయనే విలన్ అనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్. 

ఎస్. జె. సూర్య మంచి దర్శకుడు. ఆ మధ్య వరుస ఫ్లాపులు రావడంతో ఆయన నటుడిగా మారాడు. మహేశ్ బాబుతో చేసిన 'స్పై' .. శింబుతో చేసిన 'మానాడు' సినిమాలు ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందుకే శంకర్ ఆయనకి ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. 'ఇండియన్ 2'లో కాజల్ .. రకుల్ .. ప్రియభవాని శంకర్ .. సిద్ధార్థ్ .. బాబీ సింహా .. సముద్రఖని ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

Kamal Haasan
Kajal Agarwal
Rakul Preet Singh
Indian 2
  • Loading...

More Telugu News