Teja: ఒక పెద్ద హీరో కథ మార్చమన్నాడు .. కుదరదని చెప్పాను: డైరెక్టర్ తేజ

Teja Interview

  • లవ్ స్టోరీస్ ఎక్కువగా చేస్తూ వచ్చిన తేజ 
  • 'చిత్రం' సినిమా విషయంలో అలా జరిగిందని వెల్లడి 
  • తన కథను ఎవరి కోసం మార్చే అలవాటు లేదని వ్యాఖ్య 
  • స్టార్స్ తో సినిమాలు చేయలేదనే బాధ లేదని స్పష్టీకరణ 

తేజ ఎక్కువగా కొత్త హీరోలతో .. హీరోయిన్లతోనే సినిమాలు చేశారు. ఎక్కువగా చేసింది కూడా ప్రేమకథలే. స్టార్ హీరోలతో కలిసి ఆయన పనిచేయలేదు .. స్టార్స్ తో సినిమాలు చేయాలనే ఆసక్తి కూడా తనకి లేదని చెబుతూనే వచ్చారు. అలాంటి తేజ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"నేను డైరెక్టర్ కాకముందు చెన్నైలో నన్ను ఒక మేకప్ అసిస్టెంట్ సైకిల్ పై తిప్పాడు. 'చిత్రం' సినిమాకి అతన్నే మేకప్ మెన్ గా తీసుకోవాలని అనుకున్నాను. కంపెనీ మేకప్ మేన్ నే పెట్టుకోవాలని అంటే, ఆ సినిమా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. నేను నమ్మిన విషయం పట్ల అంత బలంగా ఉంటాను. అందుకే ఒక పెద్ద హీరో కథ మార్చమని అంటే కుదరదని చెప్పాను" అని అన్నారు. 

"ఒకరు చెప్పారని నేను నా కథను మార్చితే డైరెక్టర్ గా అక్కడ నేను ఫెయిల్ అయినట్టేనని భావిస్తాను. అందువలన నా కథను నేను మార్చను .. నేను మారను .. నా పద్ధతి ఇంతే. ఇలా ఉండటం వలన పెద్ద హీరోలతో సినిమాలు చేయలేకపోయాననే బాధలేదు. నేను నేనుగా బ్రతుకుతున్నందుకు సంతోషపడతాను" అంటూ చెప్పుకొచ్చారు.

Teja
Director
Tollywood
  • Loading...

More Telugu News