Nara Lokesh: నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన కమలాపురం నేతలు

Kamalapuram leaders joins TDP under Nara Lokesh presence

  • కడప జిల్లాలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • టీడీపీలోకి భారీగా చేరికలు
  • నేతలకు పసుపు కండువాలు కప్పిన లోకేశ్
  • తెలుగుదేశం పార్టీలోకి ఆత్మీయ స్వాగతం

కడప జిల్లాలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. తాజాగా, లోకేశ్ సమక్షంలో కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ నేతలు టీడీపీలో చేరారు. 

చెన్నముక్కపల్లి విడిది కేంద్రంలో కమలాపురం నియోజకవర్గం తప్పెట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ గడికోట శాంతి, ఆమె భర్త సుధాకర్ రెడ్డి, గండిరెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచులు గాలి ప్రసాద్ రెడ్డి, దర్శన్ రెడ్డి, మిట్టపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, గోనుమాకపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, అంబవరం మాజీ ఎంపీటీసీ ముంతా జానయ్య, సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి, నాగేంద్ర రెడ్డి, దళిత నేతలు కొప్పుల జగన్, అనిల్, చంటితో పాటు పలువురు దళిత యువకులు లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ పసుపు కండువాలు కప్పిన లోకేశ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వీరే కాకుండా కమలాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వారు కూడా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. మిట్టపల్లికి చెందిన 20 కుటుంబాలు, గంగిరెడ్డిపల్లికి చెందిన 30 కుటుంబాలు, గోనుమాకులపల్లికి చెందిన 30 కుటుంబాలు, అలిదిన, పాయసంపల్లి, పడదుర్తి, చడిపిరాళ్లకు చెందిన ఎస్సీలు, ఎస్ఆర్ నగర్, జేబీ నగర్ కాలనీ, ఉప్పరపల్లికి చెందిన 40 కుటుంబాలు, తోలగంగనపల్లికి చెందిన 8 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారందరికీ లోకేశ్ టీడీపీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో కమలాపురంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. రాక్షస పాలనను అంతమొందిస్తేనే కడపజిల్లా వాసులకు స్వేచ్ఛ కలుగుతుందని తెలిపారు. సీఎం సొంత జిల్లాలోనే ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తి ఉందని, కడప జిల్లాలో జగన్ పనైపోయిందని వ్యాఖ్యానించారు.  జగన్ ను నమ్ముకున్నవారే వైసీపీ నుండి బయటకు వస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జగన్ కు కడప జిల్లాలో ఎదురుగాలి వీచిందని తెలిపారు.

  • Loading...

More Telugu News