Kevvu Kartheek: కాబోయే భార్యను పరిచయం చేసిన జబర్దస్త్ ఆర్టిస్ట్ కెవ్వు కార్తీక్

Jabardast fame Kevvu Kartheek reveals his fiancee
  • జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్
  • ముఖచిత్రం, నేను స్టూడెంట్ సర్ చిత్రాల్లోనూ నటించిన వైనం
  • త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న కెవ్వు కార్తీక్
  • సిరిని పరిచయం చేసేందుకు సరైన సమయం అంటూ ప్రకటన 
జబర్దస్త్ కామెడీ ఆర్టిస్ట్, సినీ నటుడు కెవ్వు కార్తీక్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముఖచిత్రం, నేను స్టూడెంట్ సర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ పెళ్లి చేసుకోబోతున్నాడు. తాజాగా, తన కాబోయే శ్రీమతిని అందరికీ పరిచయం చేశాడు. తాను చేసుకోబోయే అమ్మాయి పేరు సిరి అని వెల్లడించాడు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటే తాను నమ్మేవాడ్ని కాదని, కానీ ఇప్పుడది నిజమే అనిపిస్తోందని కెవ్వు కార్తీక్ పేర్కొన్నాడు. 

ఇద్దరు వ్యక్తులు, రెండు జీవితాలు, వేర్వేరు అభిప్రాయాలు, భిన్న ప్రపంచాలు ఒక్కటిగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుండడం ఆనందంగా ఉందని తెలిపాడు. ఎట్టకేలకు నా జీవిత భాగస్వామి సిరిని పరిచయం చేసేందుకు ఇదే తగిన సమయం అంటూ కెవ్వు కార్తీక్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.
Kevvu Kartheek
Siri
Wedding
Jabardasth

More Telugu News