Royal Enfield: మే నెలలో 22 శాతం అమ్మకాల వృద్ధి నమోదు చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్

Royal Enfield registers 22 percent sales in May

  • కరోనా సంక్షోభం నుంచి పుంజుకున్న రాయల్ ఎన్ ఫీల్డ్
  • కొత్త మోడళ్లు తీసుకువచ్చిన మోటార్ సైకిల్ దిగ్గజం
  • ఈ ఏడాది మే నెలలో 77,461 బైకుల అమ్మకం
  • గతేడాది మేలో 53,525 యూనిట్ల అమ్మకం

మోటార్ సైకిల్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ ఫీల్డ్ కరోనా సంక్షోభం కలిగించిన నష్టాల నుంచి పుంజుకుంటోంది. ఇటీవల కొత్త మోడళ్లతో సందడి చేస్తున్న రాయల్ ఎన్ ఫీల్డ్ జోరుగా అమ్మకాలు సాగిస్తోంది. 

రాయల్ ఎన్ ఫీల్డ్ మే నెలలో 22 శాతం అమ్మకాల వృద్ధి నమోదు చేసింది. గత నెలలో 77,461 బైకులు విక్రయించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 2022 మే నెలలో 53,525 యూనిట్లు విక్రయించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ ఏడాది ఏప్రిల్ తో పోల్చితే తాజా అమ్మకాల్లో 5.9 వృద్ధి సాధించినట్టు వివరించింది. ఏప్రిల్ లో 73,136 బైకులు విక్రయించినట్టు తెలిపింది. ఇక, ఏప్రిల్ నెలలో 4,225 బైకులు ఇతర దేశాలకు ఎగుమతి చేయగా, మే నెలలో ఆ సంఖ్య 6,666కి పెరిగింది. 

రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ సీఈవో బి.గోవిందరాజన్ మాట్లాడుతూ... తమ సంస్థ ఉత్పత్తి చేసే అన్ని బైకుల్లో హంటర్ మోడల్ ఒక్క నెలలోనే అత్యధిక అమ్మకాలు నమోదు చేసుకుందని తెలిపారు.

Royal Enfield
Sales
May
Hunter
  • Loading...

More Telugu News