Movie: ఓటీటీలో సూపర్ హిట్.. 10 రోజుల తర్వాత థియేటర్ లో విడుదల

Movie released in theatres after released in OTT
  • గత నెల 23న జీ5లో విడుదల అయిన 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై'
  • ప్రధాన పాత్ర పోషించిన మనోజ్ బాజ్ పాయి
  • నిన్న థియేటర్లలో విడుదల అయిన చిత్రం
ఏ సినిమా అయినా ముందు థియేటర్లలో విడుదలయి ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం ముందు ఓటీటీలో విడుదలయి ఆ తర్వాత థియేటర్లలో విడుదలయింది. మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్ర పోషించిన 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' సినిమా ఇది. గత నెల 23న జీ5లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయింది. గంటల వ్యవధిలోనే దీనికి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. 

ఓటీటీలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం నిన్న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓటీటీలో విడుదలైన 10 రోజుల తర్వాత థియేటర్లలోకి వచ్చిన తొలి చిత్రం ఇదే. తెలుగులో 'కలర్ ఫొటో' చిత్రం కూడా ఇలాగే విడుదలయింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం రెండేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ చేశారు.
Movie
OTT
Theatre

More Telugu News