Tovino Thomas: '2018' సినిమా 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..!

2018 movie update

  • మలయాళంలో హిట్ కొట్టిన '2018'
  • తెలుగులో 8.21 కోట్ల గ్రాస్ వసూలు 
  • సహజత్వానికి దగ్గరగా నడిచిన కథాకథనాలు 
  • సక్సెస్ లో ప్రధానమైన పాత్రను పోషించిన ఎమోషన్స్ 

ఈ మధ్య కాలంలో మలయాళంలో జనాలు ఎక్కువగా మాట్లాడుకున్న సినిమాల జాబితాలో '2018' ఒకటిగా కనిపిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా ఇప్పుడు అక్కడ 200 కోట్ల మార్క్ ను టచ్ చేయడానికి చాలా దగ్గరలో ఉంది. ఆంటోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 26వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగులో ఈ సినిమాను బన్నీ వాసు రిలీజ్ చేశాడు. పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, రెండు రోజుల్లోనే 2.73 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 8 రోజుల్లో 8.21 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. తొలి వారంలోనే లాభాలు తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. ఈ కంటెంట్ పై తనకి నమ్మకం ఉందని బన్నీ వాసు చెప్పిన మాటలను నిజం చేసింది. 

2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో స్టార్స్ చాలామంది ఉన్నారు. కానీ వాళ్లంతా ముఖ్యమైన పాత్రధారులుగా మాత్రమే ఈ కథలో కనిపిస్తారు. సినిమాలో ముప్పావు వంతు వానలో .. వరదలో నడుస్తుంది. తుపాను వాతావరణం తీసుకుని రావడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎమోషన్స్ కనెక్ట్ కావడం ఈ సినిమా సక్సెస్ కి కారణమని చెప్పచ్చు. 

More Telugu News