Sachin Tendulkar: రూ.4 కోట్ల లగ్జరీ లంబోర్ఘిని కారును కొనుగోలు చేసిన సచిన్ టెండూల్కర్

Sachin Tendulkar buys Lamborghini Urus S for 4 crore
  • ఇప్పటికే సచిన్ గ్యారేజీలో ఎనిమిది వరకు లగ్జరీ కార్లు
  • తాజాగా లేటెస్ట్ టాప్ వేరియంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ కొనుగోలు
  • లంబోర్ఘిని కారులో సచిన్ ప్రయాణిస్తున్న వీడియో
సచిన్ టెండూల్కర్ కు కార్లు అంటే ఎంతో ఇష్టం. తనకు నచ్చిన కారును కొనుగోలు చేస్తాడు. ఇప్పటికే సచిన్ ఇంట్లో ఎనిమిది వరకు లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా తన గ్యారేజీలోకి మరో విలాసవంతమైన కారును చేర్చాడు మాస్టర్ బ్లాస్టర్. లేటెస్ట్ టాప్ వేరియంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ లగ్జరీ కారును సచిన్ కొనుగోలు చేశాడు.

సచిన్ గ్యారేజీలోకి చేరిన తాజా కారు వ్యాల్యూ రూ.4.18 కోట్లు. ఈ కారు ఉరుస్ లైనప్ లో వచ్చిన రెండో మోడల్. టెండూల్కర్ ఈ లంబోర్ఘిని కారులో ప్రయాణిస్తున్న వీడియోను సీఎస్ 12 వోల్గ్స్ అనే యూట్యూబ్ సంస్థ షేర్ చేసింది. 2012 నుండి కార్ల సంస్థ బీఎండబ్ల్యుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు సచిన్. దీంతో అతని గ్యారేజీలో బీఎండబ్ల్యు కార్లు ఎక్కువగా ఉంటాయి.
Sachin Tendulkar
car

More Telugu News