godra: 'యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా' టీజర్ విడుదల
- ది కశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీ తర్వాత హిందీలో మరో మూవీ
- 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లపై సినిమా
- ఇది ప్రమాదమా లేక కుట్రపూరితమా అనే కోణంలో సినిమా
హిందీ సినిమా 'యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా' టీజర్ విడుదలైంది. 1990లలో కశ్మీరీ పండితుల ఊచకోతపై గత ఏడాది ది కశ్మీరీ ఫైల్స్, కేరళలో లవ్ జిహాద్ పై ది కేరళ స్టోరీ సినిమాలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం, అల్లర్లకు సంబంధించిన కథతో యాక్సిడెంట్ ఆర్ కాన్స్పిరసీ: గోద్రా సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రానికి ఎం.కె. శివాక్ష్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు బీజే పురోహిత్, రామ్ కుమార్ పాల్.
గోద్రా ఘటన నిజంగానే ప్రమాదమా? లేక కుట్ర దాగి ఉందా? అనే కోణంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2002లో గోద్రాలో జరిగిన రైలు దగ్ధం కేసు విషయానికి వస్తే... అయోధ్యకు వెళ్లివస్తున్న 59 మంది కరసేవకులు ఈ ఘటనలో అసువులు బాశారు. ఆ తర్వాత గుజరాత్ లో మత కల్లోలాలు జరిగాయి. గోద్రా రైలు దగ్ధం వెనుక అసలు సూత్రధారి ఎవరు, ఆ రోజు ఏం జరిగింది, గోద్రా రైలు దగ్ధం అనంతరం జరిగిన అల్లర్లకు కారణాలు ఏమిటి? అనే కోణంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది.