Weather: రాష్ట్రంలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి: అమరావతి వాతావరణ కేంద్రం

AP weather forecast

  • ఏపీలో వేడి వాతావరణం
  • మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి
  • కోస్తాంధ్ర, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల వర్షం
  • ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు

ఏపీలో వేడి వాతావరణం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయని తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వివరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు, రాగల రెండ్రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అంతటా విస్తరిస్తాయని వాతావరణ సంస్థ వెల్లడించింది.

Weather
Western Winds
Heat Wave
Andhra Pradesh
  • Loading...

More Telugu News