CSK: అహ్మదాబాద్ లో ధోనీ సేనకు ఘనస్వాగతం

Grand Welcome for CSK in Ahmedabad

  • రేపు ఐపీఎల్ ఫైనల్
  • అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో టైటిల్ సమరం
  • చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనున్న గుజరాత్ టైటాన్స్
  • అహ్మదాబాద్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బృందం

ఐపీఎల్ 16వ సీజన్ టైటిల్ సమరానికి సర్వం సిద్ధమైంది. రేపు (మే 28) అహ్మదాబాద్ లోని ఐకానిక్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ చేరుకుంది. ధోనీ సేనకు అహ్మదాబాద్ నగరంలోని ఐటీసీ నర్మదా హోటల్ లో బస ఏర్పాటు చేశారు. 

విమానాశ్రయం నుంచి సీఎస్కే బృందం నేరుగా హోటల్ కు చేరుకుంది. చెన్నై ఆటగాళ్లకు, సహాయక బృందానికి గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. హోటల్ లాంజ్ లో గుజరాతీ నృత్యాలు, పలు కళారూపాలు ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News