Jefferson Machado: నాలుగు నెలల క్రితం అదృశ్యమైన బ్రెజిల్ నటుడు.. చంపి చెక్కపెట్టెలో పెట్టి పూడ్చేశారు!

Brazilian Actor Who Missing For 4 Months Found Dead
  • భూమికి ఆరు అడుగుల లోతున చెక్కపెట్టెలో పూడ్చివేత
  • చేతులు తల వెనకకు కట్టి ఉన్నాయన్న న్యాయవాది
  • జెఫర్సన్ అంటే అసూయపడే వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆవేదన
  • నిందితుడు చివరిసారి నెల రోజుల క్రితం పూడ్చివేసిన ఇంటి వద్ద కనిపించిన వైనం
నాలుగు నెలల క్రితం అదృశ్యమైన బ్రెజిల్ నటుడు జెఫర్సన్ మచాడో (44)  చనిపోయి కనిపించాడు. రియోడిజెనీరోలోని ఓ ఇంటి బయట చెక్కపెట్టెలో శవమై కనిపించినట్టు ‘న్యూయార్క్ పోస్ట్’ తెలిపింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ స్నేహితుడు సింటియా హిల్సెండెజెర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. జూన్ 22న జెఫర్సన్‌ మృతదేహాన్ని భూమిలో ఆరు అడుగుల లోతున గుర్తించినట్టు పేర్కొన్నాడు. చెక్కపెట్టెలో పాతిపెట్టిన అనంతరం పైన కాంక్రీట్ చేసినట్టు తెలిపారు.

జెఫర్సన్ చేతులు తల వెనకకు కట్టివేసి ఉన్నాయని ఆయన కుటుంబ న్యాయవాది తెలిపారు. వేలి ముద్రల ద్వారా మృతదేహాన్ని గుర్తించామని, మెడపై ఓ గీత కూడా ఉందని, గొంతుకోసి హత్య చేసినట్టుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. జెఫర్సన్‌ అంటే అసూయపడే, దుష్టులైన వ్యక్తులు ఆయనను దారుణంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడు చివరిసారి నెల రోజుల క్రితం ఆ ఇంట్లో కనిపించినట్టు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తికి జెఫర్సన్ బాగా తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని అనుమానిస్తున్నారు.
Jefferson Machado
Brazil Actor
Rio de Janeiro

More Telugu News