Chandrababu: వివేకా హత్య కేసును ఎన్ని మలుపులైనా తిప్పుతారు: చంద్రబాబు

Chandrababu held TDP Political Bureau meeting

  • రాజమండ్రిలో రేపటి నుంచి మహానాడు
  • రాజమండ్రిలో చంద్రబాబుకు ఘనస్వాగతం
  • పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించిన చంద్రబాబు
  • వివేకా హత్య కేసులో జగన్ పేరును సీబీఐ ప్రస్తావించడంపై చర్చ

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మహానాడు కోసం రాజమండ్రి చేరుకున్నారు. ఆయనకు పార్టీ వర్గాలు ఘనస్వాగతం పలికాయి. కాగా, చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. వివేకా హత్య కేసులో జగన్ పేరును సీబీఐ ప్రస్తావించడంపై ఈ సమావేశంలో చర్చించారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వివేకా హత్య కేసులో జగన్ పాత్ర జగమెరిగిన సత్యం అని పేర్కొన్నారు. వివేకా హత్య కేసును ఎన్ని మలుపులైనా తిప్పుతారు అంటూ ఇటీవల పరిణామాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 

కుట్ర బయటపడుతుందనే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయనివ్వడంలేదని చంద్రబాబు ఆరోపించారు. సీబీఐకి సహకరించకుండా పోలీసులను అడ్డుపెట్టుకున్నారని తెలిపారు. అరెస్ట్ కాకుండా ఉండేందుకు డేరా బాబా వ్యవహారాన్ని తలపించేలా మరో ఎపిసోడ్ ను సృష్టించారని విమర్శించారు.

Chandrababu
Viveka Murder
Jagan
CBI
TDP
Rajahmundry
TDP Mahanadu
  • Loading...

More Telugu News