KA Paul: పవన్... నీకు జగన్ తో గొడవెందుకు?: కేఏ పాల్

KA Paul comments on Pawan Kalyan

  • ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించిన కేఏ పాల్
  • పవన్... మోదీ, చంద్రబాబు జెండాలను మోస్తున్నాడని విమర్శలు
  • ప్యాకేజీ తీసుకోవడానికి తానేమీ పవన్ ను కాదని వ్యాఖ్యలు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి ఏపీ రాజకీయాలపై తనదైనశైలిలో వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. 

"అసలు జగన్ ఎవరో తెలియదు... నేను పవన్ ను అడుగుతున్నా... మోదీ మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఆయన జెండాను మోస్తున్నావు... చంద్రబాబునాయుడు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే, లోకేశ్ ను ముఖ్యమంత్రిని చేస్తానంటున్నావు..." అంటూ పవన్ పై ధ్వజమెత్తారు. 

"నీకు జగన్ మోహన్ రెడ్డితో గొడవెందుకు... నేను కూడా జగన్ మోహన్ రెడ్డిని కలవలేదు, ఆయనకు మద్దతు ఇవ్వలేదు. అసలు... మేము, జగన్ కలిస్తే కుప్పంలో చంద్రబాబునాయుడు కూలిపోడా?" అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. తానేమీ ప్యాకేజీ ఇస్తే తీసుకోవడానికి 10 పార్టీలు మారిన పవన్ కల్యాణ్ ను కాదని అన్నారు. 

ఇప్పటికైనా తనను ఎన్నుకోకపోతే మూర్ఖులు, దరిద్రులు... అడుక్కుతింటారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "మీరు మూర్ఖులు కాకండి, దరిద్రులు కాకండి, దేవుడు చూపిన మార్గాన్ని ఎన్నుకోండి... కులాలకు, మతాలకు అతీతంగా కేఏ పాల్ ను, మీ ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. 

లేదు... మాకు కమ్మోడు చంద్రబాబునాయుడే కావాలి అనుకుంటారేమో... కమ్మోళ్లు అందరూ నాకే సపోర్ట్ చేస్తున్నారు... లోకేశ్ వచ్చి ఏంచేస్తాడు? ఆ పప్పుకు మాట్లాడడమే సరిగా రాదు. లోకేశ్ చేస్తున్నది పాదయాత్ర కాదు.. డ్రామా యాత్ర" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News