'మేమ్ ఫేమస్' సినిమా చూశాను... బ్రిలియంట్!: మహేశ్ బాబు
- సుమంత్ ప్రభాస్ ప్రధానపాత్రలో 'మేమ్ ఫేమస్'
- రచన, దర్శకత్వం కూడా చేపట్టిన సుమంత్ ప్రభాస్
- మే 26న 'మేమ్ ఫేమస్' రిలీజ్
- ఒకరోజు ముందే సినిమా చూసిన మహేశ్ బాబు
"మేమ్ ఫేమస్ చిత్రాన్ని ఇప్పుడే చూశాను... బ్రిలియంట్ గా ఉంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాకు రచయిత, దర్శకుడు, హీరో అయిన సుమంత్ ప్రభాస్ గురించి చెప్పుకోవాలి... ఏం టాలెంట్! విజువల్స్ కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఇతర విభాగాలు కానీ అన్నీ సరిగ్గా కుదిరాయి. ఈ సినిమాలో చాలామంది కొత్తవాళ్లే అంటే నమ్మలేకపోతున్నాను. నిర్మాతలు శరత్ చంద్ర, అనురాగ్ రెడ్డిలకు, యువ చిత్రబృందానికి శుభాభినందనలు. ప్రతిభావంతులకు మద్దతుగా నిలిచినందుకు మీ పట్ల గర్విస్తున్నాను" అంటూ మహేశ్ బాబు ట్వీట్ చేశారు.