Krithi Shety: కృతి శెట్టికి అవకాశాలు తగ్గడానికి కారణమిదేనా!

Krithi Shety Special

  • మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న కృతి 
  • కెరియర్ ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్ అందుకున్న కథానాయిక
  • వరుసగా పలకరిస్తున్న పరాజయాలు 
  • స్కిన్ షో చేయడానికి నో చెబుతున్న కృతి

తెలుగు తెరకి ఇంతవరకూ చాలామంది హీరోయిన్స్ పరిచయమవుతూ వచ్చారు. కానీ మొదటి సినిమాతోనే యూత్ మొత్తాన్ని తనవైపుకు తిప్పుకోవడమనేది కృతి శెట్టి విషయంలోనే జరిగిందేమో అనిపించకమానదు. తొలి సినిమాతోనే 100 కోట్ల వసూళ్లను చూడటం .. ఆ తరువాత కూడా రెండు భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకోవడం ఆమె విషయంలోనే జరిగిందేమో అనిపిస్తుంది.

స్టార్ హీరోలతో వరుస అవకాశాలను అందుకుంటూ వెళుతున్న ఆమె స్పీడ్ మిగతా హీరోయిన్స్ ను కంగారు పెట్టేసింది. అయితే ఆ తరువాత కృతి శెట్టి చేసిన సినిమాలు పరాజయం పాలవుతూ వచ్చాయి. క్రమంగా ఆమెకి అవకాశాలు తగ్గుతూ రావడం మొదలైంది. ఇదే సమయంలో శ్రీలీల దూసుకుపోవడం మొదలైంది. ఆమె లైనప్ కూడా ఒక రేంజ్ లో ఉంది. సీనియర్ హీరోల జోడీగా మెప్పించే ఫిజిక్ ఉండటం కూడా ఆమెకి కలిసొచ్చింది. 

కృతి శెట్టికి ఫ్లాపులు రావడానికి కారణం సరైన కథలను ఆమె ఎంపిక చేసుకోకపోవడమే. అయితే ఆమెకి అవకాశాలు రాకపోవడానికి కారణం ఇంతవరకూ వచ్చిన ఫ్లాపులు కాదనే టాక్ వినిపిస్తోంది. కథకి తగినట్టుగా .. ఆడియన్స్ కోరుకునే విధంగా గ్లామర్ పరంగా డోస్ పెంచడానికి కృతి ఎంత మాత్రం ఒప్పుకోకపోవడమే ప్రధానమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కృతి ఎలాంటి వంకా పెట్టలేని బ్యూటీ .. యూత్ లో ఆమె క్రేజ్ కూడా ఎంతమాత్రం తగ్గలేదు. అలాంటి ఈ సుందరికి ఛాన్సులు తగ్గడానికి ఇదే కారణమని అంటున్నారు.

Krithi Shety
Actress
Tollywood
  • Loading...

More Telugu News