Kiren Rijiju: అరుణాచల్ ప్రదేశ్ లో ఎర్ర పాండాల దర్శనం.. వీడియో

Kiren Rijiju post about red pandas found in Arunachal Pradesh has a deep message vedio

  • అంతరించిపోతున్న జంతువుల్లో ఇది కూడా ఒకటి
  • వీడియో, ఫొటోలను షేర్ చేసిన కేంద్ర మంత్రి రిజుజు
  • వీటిని అందరం కలసి కాపాడుకుందామని పిలుపు

పాండాలు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. వీటి కోసం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. మన దేశంలోనే అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్ కు వెళితే చాలు. వీటికి సంబంధించిన ఓ వీడియోని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో షేర్ చేశారు. అసలు ఈ వీడియోని అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖండు వెలుగులోకి తీసుకొచ్చారు. 

‘‘అందంగా ఉన్న ఈ చిన్న రెడ్ పాండా తవాంగ్ లో కనిపించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచుర్ ‘అంతరించి పోతున్న జాతుల్లో’ ఇది కూడా ఉంది. వెదురు పుల్లలు, ఆకులను తిని జీవించే ఈ పాండాలకు హిమాలయ పర్వత ప్రాంతాలు ఆలవాలంగా ఉన్నాయి. మనమంతా కలసి వాటిని సంరక్షిద్దాం. జీవ వైవిధ్యానికి అవి ఎంతో ముఖ్యం’’ అని అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేర్కొన్నారు. 

‘‘ఎంతో ఆదరణీయమైన ఈ చిన్న ఎర్ర పాండా తవాంగ్ లో కనిపించింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పేమ ఖాండు దీన్ని షేర్ చేశారు. మన దగ్గరి అందమైన ఈ జంతువులను కాపాడుకుందాం’’ అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. అలాగే, ఎర్రపాండా ఫొటోను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్లోని కలింపోంగ్ జిల్లాల్లో ఇది కనిపిస్తుంది’’ అని రిజుజు తెలిపారు.

More Telugu News