YS Sharmila: నాది ఆంధ్ర అయితే.. సోనియాది ఎక్కడ?: రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్

Sharmila fires on Revanth Reddy

  • సంస్కృతిని గౌరవించలేని వ్యక్తి రేవంత్ అని షర్మిల విమర్శ
  • తన వల్ల ఉనికిని కోల్పోతానేమోనని రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా
  • జై తెలంగాణ అనే దమ్ము తనకు మాత్రమే ఉందని వ్యాఖ్య

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. తాను ఆంధ్రకు చెందిన వ్యక్తినని రేవంత్ అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది ఆంధ్ర అయితే సోనియాది ఎక్కడని ప్రశ్నించారు. సోనియాది ఇటలీ కాదా? అని అడిగారు. ఒక మహిళ పెళ్లి చేసుకున్న తర్వాత సొంత ప్రాంతాన్ని, సొంత వాళ్లను కాదని భర్త వద్దకు వస్తుందని... ఇది మన దేశ సంస్కృతి గొప్పదనమని చెప్పారు. మన సంస్కృతిని గౌరవించలేని వ్యక్తి రేవంత్ అని విమర్శించారు. సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలని అన్నారు. 

రేవంత్ అభద్రతకు గురవుతున్నారని... తన వల్ల ఉనికిని కోల్పోతానేమో అని రేవంత్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న ఏకైన ప్రాంతీయ పార్టీ వైఎస్సార్టీపీ మాత్రమేనని అన్నారు. వైఎస్సార్టీపీలో మాత్రమే తెలంగాణ అనే పదం ఉందని... జై తెలంగాణ అనే దమ్ము కేవలం తనకు మాత్రమే ఉందని చెప్పారు. జై తెలంగాణ అనే హక్కు కేసీఆర్ కు, మోదీకి, రేవంత్ కు, సోనియాకు లేదని అన్నారు.

YS Sharmila
YSRTP
Revanth Reddy
Sonia Gandhi
Congress
  • Loading...

More Telugu News