RRR: ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత

Thor rrr actor ray stevenson pasess away

  • థోర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రే స్టీవెన్సన్
  • స్టీవెన్సన్ ఇకలేరని తెలిసి షాక్ అయ్యామన్న ఆర్ఆర్ఆర్ బృందం
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్
  • స్టీవెన్సన్ మరణించారని తెలిసి సినీ అభిమానుల సంతాపం

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు. థోర్ సినిమా సీరిస్‌తో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. ఆయన మరణవార్తపై ఆర్ఆర్ఆర్ బృందం సంతాపం తెలిపింది. ఈ వార్త తమను షాక్‌కు గురిచేసిందని ట్వీట్ చేసింది. రే స్టీవెన్సన్ ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపింది. స్టీవెన్సన్ మృతిపై ఆయన ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సంతాపం తెలియజేశారు. 

స్టీవెన్సన్ నార్త్ ఐర్లాండ్‌లో 1964 మే 25న జన్మించారు. బ్రిటీష్ ఓల్డ్ వీక్ థియేటర్‌లో నటనలో శిక్షణ పొందారు. 1990ల్లో టీవీ షోలతో ఆయన తన వృత్తిజీవితాన్ని ప్రారంభించారు. 1998లో థియరీ ఆఫ్ ఫ్లైట్ సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. థోర్ సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రే స్టీవెన్సన్ చివరిగా నటించిన ‘డిస్నీ అషోకా’ సిరీస్ త్వరలో విడుదల కానుంది. 

RRR

More Telugu News