Narendra Modi: పావువా న్యూగినియాలో మోదీకి ఘన స్వాగతం.. పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని

Papua New Guinea leader who touched PM Modis feet

  • ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు పాపువా న్యూగినియాకు  మోదీ
  • ఎయిర్‌పోర్టులో భారత ప్రధానికి అరుదైన స్వాగతం
  • పాదాభివందనం చేసి మరీ ఆహ్వానించిన ప్రధాని జేమ్స్ మరాపే

అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో తాజాగా ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్‌ కోఆపరేషన్ సమిట్‌లో పాల్గొనేందుకు ఆదివారం పావువా న్యూగినియా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ అద్భుతమైన స్వాగత సత్కారం లభించింది. మోదీని ఆహ్వానించేందుకు స్వయంగా విమానాశ్రయానికి వచ్చిన పావున్యూగినియా దేశాధినేత జేమ్స్ మరాపే మోదీకి ఏకంగా పాదాభివందనం చేశారు. ఆ తరువాత ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం, మోదీ గౌరవార్ధం ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో 19- గన్ సెల్యూట్ కూడా నిర్వహించింది.  పావువా న్యూగినియా సాధారణంగా ఏ దేశాధినేతకూ ఇంతటి ఘన స్వాగతం అందించకపోవడంతో ఈ అంశం అంతర్జాతీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. 

ఎవరీ జేమ్స్ మరాపే?
  • పీఏఎన్‌జీయూ పాటీ పార్టీకి నేతృత్వం వహిస్తున్న జేమ్స్ మరాపే 2019లో ప్రధానిగా ఎన్నికయ్యారు. 
  • ఇంతవరకూ మరే దేశాధినేతనూ ఆహ్వానించని రీతిలో మోదీ కోసం మరాపే స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 
  • యూనివర్సిటీ ఆఫ్ పాపువా న్యూగినియా యూనివర్సిటీ నుంచి 1993లో జేమ్స్ డిగ్రీ చేశారు. 
  • ఆ తరువాత ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆనర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ కూడా పూర్తి చేశారు. 
  • పావువా న్యూగినియా దేశానికి జేమ్స్ మరాపే 8వ ప్రధాని. అంతకుముందు ఆయన పలు శాఖలకు కేబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. 
  • 2019లో పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జేమ్స్, పీఏఎన్‌జీయూ పాటీ పార్టీలో చేరారు. 
  • 2020లో జేమ్స్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఓ విఫలయత్నం జరిగింది. 

  • Loading...

More Telugu News