Anil Kumar Yadav: నెల్లూరులో ఏం జరిగినా నాపై బురద చల్లుతున్నారు: మాజీ మంత్రి అనిల్ కుమార్

Anil Kumar gets anger

  • నెల్లూరు వైసీపీలో విభేదాలు
  • వైసీపీ విద్యార్థి నేత హాజీపై దాడి
  • మాజీ మంత్రి అనిల్ కుమార్ పై ఆరోపణలు చేసిన డిప్యూటీ మేయర్
  • తప్పుడు ఆరోపణలు చేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చిన అనిల్  

నెల్లూరు వైసీపీలో వైషమ్యాలు భగ్గుమంటున్నాయి. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు హాజీ (వైసీపీ విద్యార్థి నేత)పై గత రాత్రి దాడి జరిగింది. హాజీ ప్రస్తుతం నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆయనను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ పరామర్శించారు. 

అనంతరం ఆయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. బాధితుడితో మాట్లాడానని, ఈ దాడి వెనుక అనిల్ కుమార్ హస్తం ఉందని చెబుతున్నాడని, ఇలాంటి దాడులు సరికాదని వ్యాఖ్యానించారు. 

దీనిపై అనిల్ కుమార్ మండిపడ్డారు. నెల్లూరులో ఏం జరిగినా తనపై బురద చల్లుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజీపై జరిగిన దాడికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేదిలేదు అంటూ హెచ్చరించారు.

Anil Kumar Yadav
Roop Kumar Yadav
Hazi
Nellore
YSRCP
  • Loading...

More Telugu News