- ఈవా గ్యాడ్జెట్ కోసం మరో విడత బుకింగ్ సేవలు
- ఈ నెల 21 నుంచి 23 వరకు
- హైదరాబాద్ స్టార్టప్ బ్లూసెమి ఆవిష్కరణ ఇది
హైదరాబాద్ కు చెందిన మెడికల్ టెక్నాలజీ స్టార్టప్ బ్లూసెమి అద్భుతమైన హెల్త్ గ్యాడ్జెట్ ‘ఈవ’ కోసం మరో విడత బుకింగ్ లను తీసుకుంటోంది. ఈ నెల 21న ఉదయం 11 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఈ ఉత్పత్తి కావాల్సిన వారు eyva యాప్,
https://eyva.io/ పోర్టల్ నుంచి బుక్ చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది. దీని ధర రూ.16,500. మొదటి రెండు బుకింగ్ లలో మంచి స్పందన వచ్చింది.
ఈ గ్యాడ్జెట్ ప్రత్యేకత ఏమిటంటే చుక్క రక్తం కూడా అవసరం లేకుండా ఫలితాలను వెల్లడిస్తుంది. ముఖ్యంగా ఇది మధుమేహులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు బ్లడ్ గ్లూకోజ్ మానిటర్లతో ఇంట్లోనే షుగర్ ఎంతున్నది పరీక్షించుకుంటూ ఉంటారు. వేలిపై సూదితో పొడిచి ఒక చుక్క రక్తాన్ని గ్లూకో మానిటర్ పై వేసినప్పుడే ఫలితం వస్తుంటుంది. రోజువారీ పరీక్షించుకోవాల్సిన అవసరం ఉన్న వారు ఎన్నిసార్లు అని అలా పొడుచుకుంటారు. నొప్పి వారిని బాధిస్తుంటుంది.
బ్లూసెమి ఈవాతో ఈ ఇబ్బంది ఉండదు. మెషిన్ పై బొటన వేళ్లను అదిమిపెట్టి ఉంచితే చాలు నిమిషంలో ఫలితాలను వెల్లడిస్తుంది. బ్లడ్ గ్లూకోజ్, హెచ్ బీఏ 1సీ ఎంతున్నది ఈ మెషిన్ చెబుతుంది. అలాగే, హార్ట్ రేట్, బ్లడ్ ప్రెజర్, ఆక్సిజన్ శాచురేషన్, ఈసీజీ ఫలితాలను తెలియజేస్తుంది. సెన్సార్లు, ఏఐ సాయంతో ఫలితాలను నిర్ధారిస్తుంది. ఈ గ్యాడ్జెట్ తో పాటు మొబైల్ అప్లికేషన్ సేవలు కూడా ఉచితం.