Bangladesh: దేశంలో అక్రమంగా నివసిస్తున్న 11 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

11 Bangladeshi nationals held for illegal stay in country

  • మహారాష్ట్రలోని థానే, రాయ్‌గఢ్ జిల్లాలకు చెందిన నలుగురు మహిళలు సహా అరెస్ట్
  • బుధవారం సాయంత్రం, గురువారం వేకువజామున అరెస్ట్
  • కమోతి, నార్పోలి ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహారాష్ట్రలోని థానే, రాయ్‌గఢ్‌ జిల్లాలకు చెందిన నలుగురు మహిళలు సహా 11 మంది బంగ్లాదేశ్‌ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో వీరు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు గురువారం ఒక అధికారి తెలిపారు. బుధవారం సాయంత్రం, గురువారం తెల్లవారుజామున వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ బంగ్లాదేశ్ జాతీయులను రాయ్‌గడ్ జిల్లాలోని పన్వెల్ సమీపంలోని కమోతే ప్రాంతం, థానే జిల్లాలోని భివాండి తాలూకాలోని నార్పోలి నుండి అదుపులోకి తీసుకున్నట్లు థానే నగర పోలీసు ప్రతినిధి తెలిపారు.

More Telugu News