Indian teche: ఫ్లోరిడాలో యాక్సిడెంట్.. భారతీయ టెకీ దుర్మరణం

Indian teche dead in florida car accident in usa
  • రోడ్డు దాటుతుండగా ఢీ కొట్టిన కారు
  • హెచ్ సీఎల్ లో టెస్ట్ లీడ్ గా పనిచేస్తున్న మరియప్పన్
  • గో ఫండ్ మీ ద్వారా ఫండ్ రైజింగ్ చేపట్టిన స్నేహితులు
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. రోడ్డు దాటుతుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని తాంపాలో అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

భారత్ కు చెందిన మరియప్పన్ సుబ్రమణియన్ ఫ్లోరిడాలోని హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలో టెస్ట్ లీడ్ గా పనిచేస్తున్నారు. మరియప్పన్ జాక్సన్ విల్లే నుంచి ఇటీవలే తాంపాకు షిఫ్ట్ అయ్యారు. ఆయన భార్య, నాలుగేళ్ల వయసున్న కొడుకు భారత్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం తాంపాలోని ఓ రోడ్డు దాటుతున్న మరియప్పన్ ను ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలైన మరియప్పన్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరియప్పన్ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు, ఆయన కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు మరియప్పన్ స్నేహితులు ‘గో ఫండ్ మీ’ ద్వారా నిధులు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
Indian teche
florida
car accident
mariyappan
USA

More Telugu News