zomato: పేమెంట్స్ బిజినెస్‌లోకి జొమాటో.. సొంతంగా యూపీఐ సర్వీసు ఏర్పాటు

Zomato launches UPI service in partnership with ICICI Bank for real time payments

  • ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి పేమెంట్స్ సర్వీస్‌ ప్రారంభించిన జొమాటో
  • ఇకపై తమ యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం
  • జొమాటో యాప్‌ ద్వారానే యూపీఐ సర్వీసులు

ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేమెంట్స్ సర్వీసెస్‌ వ్యాపారంలోకి వచ్చింది. సొంతంగా యూపీఐ సర్వీస్ అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి జొమాటో యూపీఐ పేమెంట్స్ సర్వీస్‌లను స్టార్ట్ చేసింది. తమ యూజర్లు నేరుగా వ్యక్తులు, వర్తకులకు జొమాటో యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసుకునే సౌకర్యం తీసుకొచ్చింది. ఇందుకోసం యూజర్లు జొమాటో యాప్‌లోకి వెళ్లి తమ యూపీఐ ఐడీని జనరేట్ చేసుకోవచ్చు. దీన్ని సులభంగానే క్రియేట్ చేసుకోవచ్చు. వినియోగదారులు జొమాటో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్లి అకౌంట్‌ను తెరవాలి.  

అందులో యాక్టివ్‌ జొమాటో యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకొని నచ్చిన జొమాటో యూపీఐ ఐడీని సెలెక్ట్ చేసుకోవాలి. అనంతరం మొబైల్‌ నెంబర్‌‌ను ఇచ్చి బ్యాంక్ అకౌంట్‌ను జత చేసిన తర్వాత  జొమాటో యూపీఐ జనరేట్ అవుతుంది. దాని ద్వారా జొమాటో యాప్‌తోనే పేమెంట్స్ చేసుకోవచ్చని ఫుడ్ డెలివరీ సంస్థ తెలిపింది. దాంతో, ఇకపై తమ యాప్ లో ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్‌లకు రీడైరెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉండదని, నేరుగా యూపీఐ చెల్లింపులు జరపవచ్చని వెల్లడించింది.

More Telugu News