నాని ముఖ్య అతిథిగా 'మేమ్ ఫేమస్' ఈవెంట్ .. ట్రైలర్ రిలీజ్!
- ముగ్గురు స్నేహితుల కథగా 'మేమ్ ఫేమస్'
- గ్రామీణ నేపథ్యంలో సాగే సినిమా
- నాని చీఫ్ గెస్టుగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్
- ఈ నెల 26వ తేదీన సినిమా విడుదల
కొంత సేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించారు. నాని ముఖ్య అతిథిగా .. బుచ్చిబాబు - శ్రీకాంత్ ఓదెల ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో .. ముగ్గురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
ముగ్గురు స్నేహితులు తమ ఊళ్లో పనీపాటా లేకుండా తిరుగుతుంటారు. తల్లిదండ్రుల చేత చీవాట్లు తింటూ ఉంటారు. ఈ ముగ్గురికీ కూడా ఎవరి ప్రేమకథలు వారికి ఉంటాయి. అయితే వీళ్ల తీరు వలన పిల్లను ఇవ్వడానికి అమ్మాయిల పేరెంట్స్ కూడా ఇష్టపడరు. అప్పుడు ఈ కుర్రాళ్లు ఏం చేశారనేది కథ. యూత్ ను ఎంకరేజ్ చేయండి అనే లైన్ పై నడిచే కథ ఇది. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది.