Pavan Kalyan: పవన్ 'OG' రిలీజ్ డేట్ ఖరారైనట్టే!

OG Movie Update

  • పవన్ హీరోగా రూపొందుతున్న 'OG'
  • సుజీత్ కి దక్కిన మరో భారీ ఛాన్స్ ఇది  
  • భారీ యాక్షన్ ఎంటర్టయినర్ నేపథ్యంలో సాగే కథ
  • క్రిస్మస్ కు సినిమాను విడుదల చేసే ఆలోచన   

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా సెట్స్ పైకి వెళ్లిన 'హరి హర వీరమల్లు' రకరకాల కారణాల వలన ఆలస్యమవుతూనే ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా షూటింగును పూర్తిచేయడానికి క్రిష్ తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ లోగానే పవన్ మరో మూడు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. 

ఆ ప్రాజెక్టులలో ఒకటిగా సముద్రఖని దర్శకత్వంలో చేస్తున్న సినిమా కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి తన పోర్షన్ ను పవన్ పూర్తిచేశాడు. ఇక హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగులోను పాల్గొంటూనే ఉన్నాడు. సుజీత్ సినిమాను కూడా చకచకా పూర్తిచేసే పనిలోనే ఆయన ఉన్నాడు. పవన్ హీరోగా సుజీత్ 'OG' అనే సినిమాను చేస్తున్నాడు. డీవీవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ యాక్షన్ ఎంటర్టయినర్ ను నిర్మిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భారీ షెడ్యూల్స్ షూటింగును ఆల్రెడీ పూర్తిచేశారట. ఈ ఏడాది డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

Pavan Kalyan
Sujeeth
OG Movie
  • Loading...

More Telugu News