Varun Tej: వరుణ్ తేజ్ వివాహం ఖాయమైనట్టేనా?
![varun tej and lavanya tripathi marriage is on the cards this year](https://imgd.ap7am.com/thumbnail/cr-20230517tn64648e2d7220f.jpg)
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వరుణ్ తేజ్ పెళ్లి అంశం
- లావణ్య త్రిపాఠితో పెళ్లికి ఇరువైపులా అంగీకరించినట్టు వార్తలు
- దీనిపై అధికారికంగా వెలువడని ప్రకటన
నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ వివాహం మరోసారి వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుకోనున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అది నిజమేనని తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపినట్టు సమాచారం. కాకపోతే పెళ్లి ముహూర్తాన్ని వారు ఇంకా నిశ్చయం చేసుకోలేదన్నది వార్తల సారాంశం.