Chandrababu: తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా?: చంద్రబాబు

Chandrababu fires on YCP leaders

  • తిరుపతిలో గంగమ్మ జాతర
  • ఆలయం ఎదుట జగన్ పేరుతో ముస్తాబు
  • ఇంత అహంకారమా అంటూ చంద్రబాబు ఆగ్రహం

తిరుపతిలో గత కొన్నిరోజులుగా తాతయ్యగుంట గంగమ్మ జాతర జరుగుతోంది. అయితే ఆలయం ముందు చేసిన అలంకారం తీవ్ర విమర్శపాలవుతోంది. జగన్ అనే అర్థం వచ్చేలా... J అని రాసి దాని పక్కనే గన్ బొమ్మ వేశారు. అంతేకాదు, ఆ పేరుకు పక్కనే అటూ ఇటూ వైసీపీ జెండా వేశారు. 

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? అంటూ మండిపడ్డారు. దేవుని సన్నిధిలో ఈ 'గన్' సంస్కృతి ఏంటి? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? అని నిలదీశారు. "పిచ్చి పట్టిందా? 'J' అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ల దగ్గర ఇలాంటి వేషాలా? అని నిప్పులు చెరిగారు.

Chandrababu
YCP Leaders
Gangamma Temple
Jagan
Tirupati
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News