Andhra Pradesh: తెలుగు యువకుడికి ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Youth from Anakapalli district secures three central government jobs

  • అనకాపల్లి జిల్లా మాకవరపాలెం యువకుడు రుత్తల రేవంత్ అరుదైన ఫీట్
  • ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌గా శిక్షణ పొందుతున్న యువకుడు
  • 2021 ఎస్ఎస్‌సీ పరీక్షలో కాగ్‌ విభాగంలో అకౌంటెంట్‌గా ఎంపిక
  • తాజా పరీక్షల్లో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం సాధించిన వైనం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోరుకోని యువత ఉండరు. ఆ ఉద్యోగాల కోసం అహోరాత్రులు కష్టపడుతుంటారు. ఉద్యోగాల కోసం తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఓ విద్యార్థి ఏకంగా మూడు ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు. ఏపీకి చెందిన రుత్తల రేవంత్ ఈ అరుదైన ఘనత సాధించాడు. రేవంత్ స్వస్థలం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం. అతడి తండ్రి రుత్తల సత్యనారాయణ వ్యాపారం చేస్తుండగా, తల్లి పద్మావతి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. 

ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌గా శిక్షణలో ఉన్న రేవంత్‌కు మరో రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగావకాశాలు తలుపు తట్టాయి. 2021లో అతడు స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్ పరీక్షలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విభాగంలో అకౌంటెంట్‌గా ఎంపికయ్యాడు. దీనికి సంబంధించి నియామక ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తూనే ఈ ఏడాది మార్చిలో జరిగిన మరో పరీక్షకూ హాజరయ్యాడు. ఈ నెల 12న ఫలితాలు విడుదలవగా రేవంత్ 390 మార్కులకు గానూ 332 సాధించాడు. ఫలితంగా, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ కస్టమ్స్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జామినర్)గా అర్హత సాధించాడు. జీవితంలో పెద్దహోదాకు చేరాలన్న లక్ష్యంతో రేవంత్ చిన్నతనం నుంచే కష్టపడి చదివాడు. తమ కుమారుడి విజయాలు చూసిన తల్లిదండ్రులు సంబరపడిపోయారు.

  • Loading...

More Telugu News