DK Shivakumar: నా బలం మాత్రం 135 మంది ఎమ్మెల్యేలు: డీకే శివకుమార్

My powe is 135 MLAs says DK ShivaKumar

  • ఇతరుల సంఖ్యాబలం గురించి తనకు సంబంధం లేదని వ్యాఖ్య
  • సీఎం ఎంపికపై కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించారని ఆవేదన
  • క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే మరిన్ని సీట్లు పెరిగేవన్న డీకే

కాంగ్రెస్ పార్టీ తన అధ్యక్షతనే 135 అసెంబ్లీ స్థానాల్లో గెలిచిందని, వీరందరి మద్దతు తనకే ఉందని ఆ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. సీఎం ఎంపిక అంశాన్ని అధిష్ఠానానికి వదిలేస్తామని తొలుత నిర్ణయించినప్పటికీ, కొంతమంది వారి వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారని అన్నారు. ఇతరుల సంఖ్యాబలం గురించి తాను ఏమీ మాట్లాడనని, తన సంఖ్యాబలం మాత్రం 135 అనీ అన్నారు. క్షేత్రస్థాయి నుండి మరింత సహకారం ఉంటే సీట్లు పెరిగేవని, అయినప్పటికీ ఫలితాల విషయంలో తాము సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.

కర్ణాటక కాంగ్రెస్ లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సిద్ధరామయ్య ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. డీకే కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. రేసులో ఇద్దరు కీలక వ్యక్తులు ఉండటంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏం నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ నెలకొంది.

DK Shivakumar
Karnataka
  • Loading...

More Telugu News