Mayaj agarwal: సీబీఐకి కొత్త డైరెక్టర్ రాకతో.. ట్రెండింగ్​లో సన్ రైజర్స్ స్టార్​ క్రికెటర్.. ఇద్దరికీ సంబంధం ఏంటి?

Mayaj agarwal Father in law is New CBI director

  • కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ కు సీబీఐ పగ్గాలు
  • ఆయన పెద్ద కూతురును పెళ్లి చేసుకున్న మయాంక్ అగర్వాల్
  • ఈ ఐపీఎల్‌ లో సన్ రైజర్స్ జట్టుకు ఆడుతున్న మయాంక్

సీబీఐ నూతన డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ నియమితులయ్యారు. ప్రధానమంత్రి మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధురి తో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఆయన్ను ఎంపిక చేసింది. మూడేళ్ల పాటు కర్ణాటక డీజీపీగా పని చేసిన ప్రవీణ్.. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డి.కె శివకుమార్ విమర్శలు చేయడంతో ప్రవీణ్ వార్తల్లో నిలిచారు. 

ఇదిలావుంచితే, ఆయన సీబీఐ డైరెక్టర్ గా ఎంపికైన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు మయాంక్ అగర్వాల్ పేరు ట్రెండింగ్ గా మారింది. మయాంక్ ను అభినందిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వస్తున్నాయి. 

దాంతో, అసలు ప్రవీణ్ కు, మయాంక్ అగర్వాల్‌ కు సంబంధం ఏంటి? అన్న చర్చ మొదలైంది. సీబీఐ నూతన డైరెక్టర్ ప్రవీణ్ సూద్.. మయాంక్ కు పిల్లనిచ్చిన మావయ్య. ప్రవీణ్ పెద్ద కూతురు ఆష్రిత సూద్ ను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో పుట్టిన మయాంక్ తన స్నేహితురాలైన ఆష్రితకు 2017లో ప్రపోజ్ చేశాడు. పెద్దలు కూడా ఒప్పుకోవడంతో 2018లో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. గతేడాది ఈ జంటకు ఓ బాబు జన్మించాడు. గత సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరించిన మయాంక్ ను  ఈ ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. కానీ, ఈ సీజన్ లో మయాంక్ పెద్దగా ఆకట్టుకోవడం లేదు.

Mayaj agarwal
Father in law
cbi
director
ipl
sunrisers hyderabad
  • Loading...

More Telugu News