Train Accident: లోకో పైలట్ సమయస్ఫూర్తితో డబుల్ డెక్కర్ రైలుకు తప్పిన పెను ప్రమాదం

Bengaluru to Chennai double dekker train derail
  • పట్టాలు తప్పిన బెంగళూరు - చెన్నై డబుల్ డెక్కర్
  • బిసనట్టం రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన
  • చెన్నై - బెంగళూరు మార్గంలో నిలిచిన పలు రైళ్లు, ప్రయాణికుల ఇబ్బంది
బెంగళూరు నుండి చెన్నై వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు బిసనట్టం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. లోకో పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పరిస్థితిని గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశారు. దీంతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. 

విషయం తెలియగానే రైల్వే శాఖ సాంకేతిక నిపుణులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. రైళ్లను క్రమబద్ధీకరించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. డబుల్ డెక్కర్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై - బెంగళూరు మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
Train Accident

More Telugu News