Ramcharan: పెద్దమనసును చాటుకుంటున్న చరణ్ ఫ్యాన్స్!

- 'గ్లోబల్ స్టార్' గా ఎదిగిన చరణ్
- 'ఆర్ ఆర్ ఆర్' తరువాత పెరిగిన అభిమానుల సంఖ్య
- సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న అభిమానులు
- వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు బటర్ మిల్క్ ప్యాకెట్ల పంపిణీ
దేశ వ్యాప్తంగా చరణ్ కి ఇప్పుడు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో .. ఆస్కార్ వేదికపై ఆ సినిమాకి లభించిన గుర్తింపుతో .. 'గ్లోబల్ స్టార్'గా లభించిన ఆదరణతో చరణ్ స్టార్ డమ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇక చరణ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటూ, తన కెరియర్ గ్రాఫ్ ను మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళుతున్నాడు.

