Crime News: వాట్సాప్‌లో లింక్.. క్లిక్ చేసినందుకు అకౌంట్లోంచి రూ.6.16 లక్షలు మాయం

Nagpur man loses rs 6 lakhs to fraudster

  • యువకుడికి గుర్తు తెలియని మహిళ నుంచి వాట్సాప్ కాల్
  • ఓ కంపెనీ వివరాలను వెరిఫై చేయాలంటూ మహిళ విజ్ఞప్తి
  • రివ్యూ ఇవ్వాలంటూ వాట్సాప్‌కు లింక్ పంపించిన నిందితురాలు
  • లింక్‌పై క్లిక్ చేసిన బాధితుడి అకౌంట్ నుంచి క్షణాల్లో డబ్బులు మాయం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ కు చెందిన ఓ యువకుడు సైబర్ నేరగాళ్ల బారిన పడి ఏకంగా రూ.6.16 లక్షలు పోగొట్టుకున్నాడు. మందూవెనుకా ఆలోచించకుండా వాట్సాప్‌లో వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి నష్టపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఖమ్లా ప్రాంతానికి చెందిన యువకుడికి ఇటీవల వాట్సాప్‌లో ఓ మహిళ ఫోన్ చేసింది. ఓ కంపెనీకి సంబంధించిన వివరాలను వెరిఫై చేయాలని కోరింది. తను పంపించే లింక్ ద్వారా కంపెనీ వివరాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చుతూ రివ్యూ ఇవ్వమని కోరింది. దీంతో, యువకుడు ఆమె పంపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. ఆ తరువాత క్షణాల వ్యవధిలో అతడి అకౌంట్లోని రూ. 6.16 లక్షలు పోయాయి. యువకుడు చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

  • Loading...

More Telugu News