Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు అంబటి రాంబాబు బహిరంగ లేఖ

Ambati Rambabu open letter to pawan kalyan
  • చంద్రబాబును కాపాడుకోవడం కోసం జనసేనాని ప్రయత్నమని వ్యాఖ్య
  • ప్రతిపక్షాల పొత్తు కేవలం పవన్ రాజకీయ ఎత్తుగడ అన్న అంబటి
  • చంద్రబాబుతో రాజకీయ వివాహ బంధం కోసమేనని విమర్శ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి అంబటి రాంబాబు బహిరంగ లేఖ రాశారు. నిన్న మంగళగిరిలో మాట్లాడిన పవన్ కల్యాణ్ పొత్తు ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు.. జనసేనానిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు లేఖాస్త్రం సంధించారు.

చంద్రబాబును కాపాడుకోవడానికి నాలుగేళ్ల తర్వాత బీజేపీతో కలిశాడని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కేవలం పవన్ రాజకీయ ఎత్తు అని విమర్శించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ నడుచుకుంటున్నాడన్నారు.

2014 ఎన్నికల్లో పోటీ వద్దంటే పవన్ దూరంగా ఉన్నాడని, 2019లో చంద్రబాబుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు లెఫ్ట్ పార్టీలతో కలిశాడన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షాల కూటమి అంటున్నాడని విమర్శించారు. చంద్రబాబుతో రాజకీయ వివాహ బంధం కోసం రైతుల పేరిట పర్యటిస్తున్నాడని ఆరోపించారు.

Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Ambati Rambabu

More Telugu News