Turtle: చిన్న తాబేలు కూడా ప్రమాదకరమే.. ఇదిగో వీడియో

Turtle attacks woman while she feeds water to it
  • తాబేలుకి నీరు పోస్తున్న మహిళ
  • ఉన్నట్టుండి దాడికి దిగన తాబేలు
  • మధ్యలో నెట్ ఉండడంతో తప్పిన ప్రమాదం
చిన్న తాబేళ్లు చాలా చోట్ల కనిపిస్తుంటాయి. నదులు, చెరువులు, సముద్రాల్లోనూ ఉంటాయి. కానీ, వీటి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. తాబేలుకి నీటిని పట్టిస్తున్న సమయంలో అది దాడికి దిగిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

స్ట్రేంజెస్ట్ మీడియా ఆన్ లైన్ పేరుతో ఉన్న ట్విట్టర్ పేజీలో ఈ వీడియోని షేర్ చేశారు. ఒక తాబేలు నెట్ కు అవతలి వైపు ఉంది. అది దాహంతో ఉందనుకుని ఓ మహిళ వాటర్ బాటిల్ తో నెట్ ఇవతలి వైపు నుంచి నీరు పోస్తోంది. అది నోరు తెరిచినప్పుడల్లా ఆమె నీరు పోస్తోంది. ఈ క్రమంలో అది ఉన్నట్టుండి దాడికి దిగబోయింది. చేయి చిక్కితే గాయాలయ్యేవి. మధ్యలో నెట్ ఉండడం వల్ల ఏమీ కాలేదు.
Turtle
attacked
woman
water feeding

More Telugu News