Telangana: తెలంగాణ పోలీసులు ధైర్యవంతులు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలి: కిషన్ రెడ్డి

Kishan Reddy praises Telangana police

  • పోలీస్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్న కిషన్ రెడ్డి  
  • కోట్ల రూపాయల కమాండ్ కంట్రోల్ రూమ్ ఏం చేస్తోందని ప్రశ్న
  •  విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టిందని ఆరోపణ  

తెలంగాణ పోలీసులు చాలా ధైర్యవంతులని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ లో కోట్ల రూపాయలతో కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. పోలీసులకు ప్రభుత్వం స్వేచ్ఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం భూఆక్రమణలకు పాల్పడుతోందన్నారు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసి విలువైన భూములను బినామీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచి పెట్టిందన్నారు.

రైతుల సమస్యలు పరిష్కరిస్తానని కేసీఆర్ ధరణి పోర్టల్ ను తీసుకు వచ్చారని, ధరణితో లక్షలాది మంది రైతులు, భూయజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పోర్టల్ కారణంగా చట్టబద్ధమైన లక్షల ఎకరాల భూమిని ప్రొబేటరీ ల్యాండ్ గా ప్రకటించడం వల్ల చాలామంది కోర్టుల చుట్టు తిరుగుతున్నారన్నారు. ఈ పోర్టల్ ను అడ్డుపెట్టుకొని మధ్యవర్తులు, దళారీలను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. వీరి బారినపడి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

Telangana
Hyderabad
Police
  • Loading...

More Telugu News